
సినిమాలు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిర్వహణను ప్రజలకు ఇబ్బంది లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని డీజీపీ సీవీ ఆనంద్ ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఔటర్ రింగ్ రోడ్‌పై జరిగిన ప్రమాదాలు, అలాగే వీఐపీ కాన్వాయ్ కారణంగా ట్రాఫిక్ నిలిపివేయడంపై వచ్చిన నిరసనల నేపథ్యంలో ఆయన ఈ సూచనలు చేశారు. వేగ నియంత్రణ, రోడ్డు భద్రతా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్లు, డీసీపీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నగర ట్రాఫిక్ పరిస్థితిని డీజీపీ సమగ్రంగా పరిశీలించారు. విభాగాల మధ్య సమన్వయం పెంచాలని సూచించారు. త్వరలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, సీట్ బెల్ట్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!