

వైద్య వృత్తి కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాదని, అది మానవాళికి సేవ చేయడానికి తీసుకునే పవిత్ర బాధ్యత అని తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ 175వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిన ఆయన, వైద్య విద్యార్థులు జ్ఞానం, సాంకేతిక నైపుణ్యాలతో పాటు కరుణ, సానుభూతి వంటి మానవీయ విలువలను అలవరచుకోవాలని సూచించారు. “సేవే పరమ ధర్మం” స్పూర్తితో దేశ ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు.
ఉస్మానియా మెడికల్ కాలేజ్ అనేక సంవత్సరాలుగా నిబద్ధతతో కూడిన వైద్యులను తయారు చేస్తూ గొప్ప వారసత్వాన్ని కలిగి ఉందని గవర్నర్ కొనియాడారు. ఆరోగ్య రంగంలో సాంకేతికత, పరిశోధన ప్రాధాన్యం పెరుగుతోందని పేర్కొంటూ, ఆధునిక పరికరాలను వినియోగిస్తూనే మానవీయతను మరవకూడదని హితవు పలికారు. విద్యార్థుల విజయంలో అధ్యాపకులు, తల్లిదండ్రుల పాత్రను ప్రత్యేకంగా ప్రశంసించారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!