
క్రీడలు

తిరుమలలో అధిక రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి తమ వంతు వచ్చేవరకు భక్తులు సంయమనంతో వేచి ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. వేసవి సెలవులు మరియు వారాంతం కలిసి రావడంతో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారని తెలిపింది. అసత్య కథనాలు మరియు తప్పుదారి చూపే సమాచారంపై భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది.
క్యూలైన్లలోని భక్తులను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని మీడియా సంస్థలు బైట్లు తీసుకోవడాన్ని టీటీడీ తీవ్రంగా ఖండించింది. భక్తులకు అన్న ప్రసాదాలు, పాలు, మజ్జిగ, మంచినీరు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరంగా అందిస్తున్నామని స్పష్టం చేసింది. దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణ పాటించాలని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!