

హైదరాబాద్: కోకాపేట నియోపాలిస్ లేఅవుట్లో భూములు ఇప్పటికీ కోట్లాది రూపాయల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. బుధవారం జరిగిన మూడో విడత వేలంలో ప్లాట్ నంబరు 19లోని 4 ఎకరాలకు ఎకరా రూ.131 కోట్లు, ప్లాట్ నంబరు 20లోని 4.04 ఎకరాలకు ఎకరా రూ.118 కోట్లు పలికాయి. కనీస ధర ఎకరాకు రూ.99 కోట్లుగా నిర్ణయించినప్పటికీ, ఈ రెండు ప్లాట్ల నుంచి మొత్తం 8.04 ఎకరాలకు గాను రూ.996 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.
ఈ నెల 28 న జరిగిన రెండో విడత వేలంలో ఎకరా ధర రూ.151 కోట్లు దాటింది. ఇప్పటివరకు మూడు విడతల వేలంలో మొత్తం 27 ఎకరాలు విక్రయమై హెచ్ఎండీఏకు రూ.3,708 కోట్ల ఆదాయం సమకూరింది.
ఇక డిసెంబరు 5 న ఇదే లేఅవుట్లోని ‘గోల్డెన్ మైల్ సైట్-2’ లో 1.98 ఎకరాల భూమిని వేలం వేయనున్నారు. ఇక్కడ కనీస ధర ఎకరాకు రూ.70 కోట్లుగా నిర్ణయించగా, వేలంలో ఎకరా ధర రూ.100 కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!