

గాజా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఐదేళ్ల పాలస్తీనా బాలిక కథ ఆధారంగా రూపొందిన ‘ద వాయిస్ ఆఫ్ హింద్ రజబ్’ (The Voice of Hind Rajab) చిత్రం భారత్‌లో సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ చిత్రానికి భారత చిత్ర ప్రమాణ మండలి అనుమతి ఇవ్వలేదని సమాచారం. దీనితో రాజకీయంగా చర్చలు ప్రారంభమయ్యాయి.
ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. వెనిస్ చిత్రోత్సవంలో అవార్డు గెలుచుకోవడంతో పాటు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కూడా ప్రదర్శించబడింది. అయితే ఈ చిత్రాన్ని భారత్‌లో విడుదల చేస్తే దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం ఉండొచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఈ నిర్ణయంపై ప్రతిపక్ష నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శశి థరూర్ సహా పలువురు నాయకులు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కి లేఖ రాశారు. ఒక చిన్నారి కథను చూపడాన్ని ఆపడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసి సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలని వారు కోరుతున్నారు.














.jpg.webp&w=3840&q=75)




.jpeg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!