

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ విదేశీ ఆటగాళ్ల లభ్యతపై అనిశ్చితి నెలకొంది. కొందరు గాయాల కారణంగా ఇంకా తమ జట్లతో చేరలేదు. మరికొందరు వర్క్‌లోడ్ కారణంగా కొన్ని మ్యాచులకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు 20 మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే విడుదలైంది. అయినప్పటికీ, ఐపీఎల్ నిర్వాహకులు సీజన్ మొత్తం ప్రణాళిక ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు.
“విదేశీ ఆటగాళ్ల భాగస్వామ్యం ఫ్రాంచైజీల నిర్ణయం. గాయాలు, వర్క్‌లోడ్ కారణంగా కొంతమంది అందుబాటులో ఉండకపోవచ్చు. వారి లభ్యతను జట్లు చూసుకుంటాయి. ఐపీఎల్ మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది. అభిమానుల కోసం పూర్తి ఏర్పాట్లు చేశాం” అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ గాయపడిన సామ్ కరన్ స్థానంలో డాసున్ శనకను జట్టులోకి తీసుకుంది. రూ.2 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్న శనక మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌తో పాటు సీమ్ బౌలింగ్‌లోనూ జట్టుకు బలం చేకూర్చనున్నాడు.










.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!