
సినిమాలు

తెలంగాణలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరతపై వస్తున్న వదంతుల నేపథ్యంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీతో మాట్లాడారు. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు.
ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ప్రజలు వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని కోరారు. తెలంగాణ అంతటా అవసరాలకు సరిపడా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సరఫరా కొనసాగుతోందని తెలిపారు. పుకార్లు వ్యాప్తి చేస్తున్న వారిపై, కారణం లేకుండా పెట్రోల్ బంకులు మూసివేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.


















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!