Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పెళ్లి రూమర్స్ పై స్పందించిన సాయి పల్లవి

07:22 AM, 27 మార్చి, 2026
పెళ్లి రూమర్స్ పై స్పందించిన సాయి పల్లవి

దక్షిణాది సినీ పరిశ్రమలో సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి మరోసారి వార్తల్లో నిలిచారు. డ్యాన్స్ షోల నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తన టాలెంట్‌తో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన ఆమె ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి నుంచే నాట్యం, నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ చదువును ప్రాధాన్యంగా తీసుకుని మెడికల్ డిగ్రీ పూర్తి చేసిన సాయి పల్లవి, ప్రేమమ్ సినిమాలో ‘మలర్ టీచర్’ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే, ఇటీవల ఆమె పెళ్లిపై వస్తున్న రూమర్లకు తానే స్వయంగా ఫుల్‌స్టాప్ పెట్టింది. ఒక కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ సాయి పల్లవి స్పష్టంగా తన అభిప్రాయం వెల్లడించింది. “ప్రస్తుతం నా పూర్తి దృష్టి కెరీర్‌పైనే ఉంది. పెళ్లి గురించి ఇప్పట్లో ఎలాంటి ఆలోచన లేదు. నేను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నాను” అని చెప్పి అందరికీ క్లారిటీ ఇచ్చింది. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు స్టార్ హీరోయిన్లు ఊహించ‌ని సమాధానాలు ఇస్తుంటారు.

కానీ సాయి పల్లవి మాత్రం ఎలాంటి సందేహాలకు తావు లేకుండా సూటిగా చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఆమె పెళ్లి విషయంపై సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఫ్యాన్స్ ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం ఆమె పెళ్లి వార్త కోసం ఎదురుచూస్తున్నారు. ఏదేమైన పెళ్లి కంటే కెరీర్‌నే ప్రాధాన్యంగా తీసుకుంటూ ముందుకు సాగుతున్న సాయి పల్లవి నిర్ణయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కొత్త “ట్యాప్ టు పాజ్” ఫీచర్

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కొత్త “ట్యాప్ టు పాజ్” ఫీచర్

పెట్రోల్‌ ధరలపై యుద్ధం ప్రభావం

పెట్రోల్‌ ధరలపై యుద్ధం ప్రభావం

11 ఏళ్ల తర్వాత అబ్బాస్‌ రీ ఎంట్రీ - దర్శకుడు మరియా రాజా

11 ఏళ్ల తర్వాత అబ్బాస్‌ రీ ఎంట్రీ - దర్శకుడు మరియా రాజా

పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన నయారా ఎనర్జీ

పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన నయారా ఎనర్జీ

బరువు తగ్గించే ఔషధాల ప్రచారంపై నిషేధం

బరువు తగ్గించే ఔషధాల ప్రచారంపై నిషేధం

ఆర్ సి బి వేలం పై స్పందించిన విజయ్ మాల్యా!

ఆర్ సి బి వేలం పై స్పందించిన విజయ్ మాల్యా!

లోకసభ, అసెంబ్లీ సీట్ల పెంపు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

లోకసభ, అసెంబ్లీ సీట్ల పెంపు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

టీటీడీలో ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌ను ఓపెన్ చేసిన సీఎం

టీటీడీలో ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌ను ఓపెన్ చేసిన సీఎం

బీజాపూర్‌లో భారీ పరిణామం… మావోయిస్టు అగ్రనేత పాపారావు లొంగుబాటు

బీజాపూర్‌లో భారీ పరిణామం… మావోయిస్టు అగ్రనేత పాపారావు లొంగుబాటు

అనకాపల్లిలో అర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన

అనకాపల్లిలో అర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన

ట్యాగ్లు
హీరోయిన్ సాయిపల్లవిపెళ్లి రూమర్స్కెరీర్తెలుగు సినిమా
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామ్‌లల్లా నుదుటిపై సూర్యతిలకం… భక్తుల కనువిందు
న్యూస్

రామ్‌లల్లా నుదుటిపై సూర్యతిలకం… భక్తుల కనువిందు

శ్రీరామనవమి శోభాయాత్రకు హైదరాబాద్‌లో పటిష్ట భద్రత!
న్యూస్

శ్రీరామనవమి శోభాయాత్రకు హైదరాబాద్‌లో పటిష్ట భద్రత!

ప్రమాదకర రసాయనంపై నిషేధం డిమాండ్
న్యూస్

ప్రమాదకర రసాయనంపై నిషేధం డిమాండ్

కొత్త కరోనా ఉపవేరియంట్ ‘సికాడా’ వెలుగులోకి!
న్యూస్

కొత్త కరోనా ఉపవేరియంట్ ‘సికాడా’ వెలుగులోకి!

అమెరికా కీలక నిర్ణయం...హెచ్-1బీ వీసాదారులకు భారీ వేతన పెంపు!
న్యూస్

అమెరికా కీలక నిర్ణయం...హెచ్-1బీ వీసాదారులకు భారీ వేతన పెంపు!

ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాల హెచ్చరిక!
న్యూస్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాల హెచ్చరిక!

రెనో ఇండియా నుంచి భారీ ఆఫర్లు.. రూ.80 వేల వరకు లాభం!
న్యూస్

రెనో ఇండియా నుంచి భారీ ఆఫర్లు.. రూ.80 వేల వరకు లాభం!

వాణిజ్య వంట గ్యాస్ సరఫరా పెంచిన కేంద్రం
న్యూస్

వాణిజ్య వంట గ్యాస్ సరఫరా పెంచిన కేంద్రం

"పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ" మోషన్ పోస్టర్ విడుదల!
సినిమాలు

"పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ" మోషన్ పోస్టర్ విడుదల!

వారంలోనే వెయ్యి కోట్ల క్లబ్‌లో 'ధురంధర్ ది రివెంజ్'
సినిమాలు

వారంలోనే వెయ్యి కోట్ల క్లబ్‌లో 'ధురంధర్ ది రివెంజ్'

ట్రాన్స్‌జెండర్ల బిల్లుపై ఎంపీ జయా బచ్చన్ ఫైర్
న్యూస్

ట్రాన్స్‌జెండర్ల బిల్లుపై ఎంపీ జయా బచ్చన్ ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!