

‘జన నాయగన్’ సినిమా లీక్ కేసులో చెన్నై సైబర్ క్రైమ్ విభాగం ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్టు చేసింది. వేరే సినిమాకు ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్‌గా పని చేసిన వ్యక్తి అనధికారికంగా ఎడిటింగ్ స్టూడియోలోకి ప్రవేశించి సినిమా డేటాను చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆ డేటాను వీడియోలుగా మార్చి ఇతరులకు పంచడంతో ఆన్‌లైన్‌లో సన్నివేశాలు లీక్ అయ్యాయి. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు అధికారులు తెలిపారు.
పైరసీని ప్రోత్సహించొద్దని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరించారు. అనధికారిక వీడియోలను పంచుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కేసులో ఇంతకుముందే ఆరుగురిని అరెస్టు చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతున్న సమయంలో, కొన్ని సన్నివేశాలు ఆన్‌లైన్‌లో లీక్ కావడం, కోయంబత్తూర్ లోకల్ ఛానల్‌లో ప్రసారం కావడం చిత్ర బృందాన్ని షాక్‌కు గురిచేశాయి. ఆ ఛానల్ యజమానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



.png&w=3840&q=75)












.jpg&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!