

ఇరాన్‌కు ఆర్థికంగా అత్యంత కీలకమైన చమురు డిపోలపై ఇజ్రాయెల్ తొలిసారి వైమానిక దాడులు జరిపింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడుల్లో దక్షిణ టెహ్రాన్‌లోని చమురు డిపోలు, రిఫైనరీ సముదాయాలు లక్ష్యంగా మారాయి. దాడుల వల్ల మూడు చమురు డిపోలలో భారీ మంటలు చెలరేగినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇరాన్ సైన్యానికి అవసరమైన ఇంధనాన్ని ఇక్కడి నుంచే సరఫరా చేస్తారని పేర్కొంటూ, ఆ దేశ సైనిక మౌలిక వసతులను దెబ్బతీయడమే ఈ దాడి ఉద్దేశమని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తెలిపింది.
ఇదే సమయంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. మినాబ్‌లో బాలికల పాఠశాలపై జరిగిన దాడి వెనుక ఇరాన్ పాత్ర ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. మరోవైపు కువైట్‌లో కూడా దాడులు కొనసాగుతున్నాయి. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఇంధన డిపోలపై డ్రోన్ దాడులు జరిగి భారీ మంటలు చెలరేగాయి. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!