

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. ఇటీవల గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్‌లపై తమ దేశం చేసిన దాడులకు క్షమాపణ చెప్పారు. ఇకపై పొరుగుదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయబోమని, అయితే తమపై దాడులు జరిగితే మాత్రం ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో గల్ఫ్ ప్రాంతాల్లో దాడులు కొనసాగించడంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సహా పలు ప్రాంతాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి.
మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై భారీ వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. టెహ్రాన్ సహా పలు నగరాల్లో 80కి పైగా యుద్ధ విమానాలతో దాడులు జరిపినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌కు చెందిన యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఇరాన్ పొరుగుదేశాలకు లొంగిపోయిందని విమర్శించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇరాన్, లెబనాన్, ఇజ్రాయెల్‌లలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!