

టాలీవుడ్‌కు సమ్మర్ సీజన్ ఎప్పుడూ ప్రత్యేకమే. కానీ గత కొన్ని సంవత్సరాల్లో సరైన ప్రణాళిక లేక ఈ సీజన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే వచ్చే ఏడాది సమ్మర్ మాత్రం చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని అంచనా. టాప్ హీరోలు బాక్సాఫీస్ బరిలో దిగేందుకు పక్కా ప్లానింగ్ చేస్తున్నారు.
ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కలయికలో వస్తున్న స్పిరిట్ చిత్రం వచ్చే ఏడాది మార్చి 5న విడుదల కానుంది. మహేష్ బాబు – ఎస్ ఎస్ రాజమౌళి సినిమా వారణాసి వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానుంది. ఈ మూడు భారీ చిత్రాలతో సమ్మర్ సీజన్ అద్భుతంగా ఉండబోతుందని అభిమానులు భావిస్తున్నారు.
స్పిరిట్ పోలీస్ యాక్షన్ థ్రిల్లర్‌గా, వారణాసి భారీ స్థాయి ప్రపంచ స్థాయి చిత్రంగా, ఎన్టీఆర్ – నీల్ సినిమా మాస్ యాక్షన్ కథగా రూపొందుతున్నాయి. టాలీవుడ్ అభిమానులు ఈ సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక్క సమ్మర్‌లో మూడు పాన్ ఇండియా లెవల్ సినిమాలు రావడం టాలీవుడ్ చరిత్రలో మైలురాయి అవుతుంది. మరి ఈ సీజన్ ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి.





.jpg&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!