
రాజకీయాలు

ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా విడుదలై రెండేళ్లు గడిచినా దేవర 2 పై ఇంకా స్పష్టత లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమా వాయిదా పడటంతో దేవర 2 కూడా ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
దేవర 2 గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఎన్టీఆర్ ఇతర సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో ఈ సీక్వెల్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరోవైపు కొరటాల శివ కొత్త కథతో బాలకృష్ణను ఒప్పించినట్లు సమాచారం.
వచ్చే నెల 20న ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఈ సినిమాపై లేదా ఇతర ప్రాజెక్ట్ పై అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. అన్ని సవ్యంగా జరిగితే ఈ ఏడాది మధ్యలో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.



.webp&w=3840&q=75)

















.jpg&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!