

అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రభుత్వం హెచ్చరించింది. ఖమేనీ మృతికి సరైన సమాధానం ఇవ్వకుండా వదిలిపెట్టబోమని ఇరాన్ క్యాబినెట్ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సంతాప వాతావరణం నెలకొన్న వేళ, రివల్యూషనరీ గార్డ్స్ కూడా ఘాటుగా స్పందించాయి.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటనలో, తమ సుప్రీం నేతను హతమార్చిన వారికి కఠిన శిక్ష తప్పదని పేర్కొన్నారు. అవసరమైతే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతిదాడులు జరుగవచ్చని హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దాడుల్లో ఖమేనీ కీలక సలహాదారులు అలీ షంఖానీ, ఐఆర్జీసీ చీఫ్ మహమ్మద్ పాక్‌పౌర్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో మాజీ రక్షణ మంత్రి అహ్మద్ వాహిదీని కొత్త కమాండర్-ఇన్-చీఫ్‌గా నియమించినట్లు ప్రకటించారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!