
సినిమాలు

దేశవ్యాప్తంగా ఎల్పీజీ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురానుంది. జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం, ఒకే కుటుంబం పీఎన్జీ (PNG) మరియు ఎల్పీజీ (LPG) కనెక్షన్లు రెండూ కొనసాగించడంపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. “ఒక కుటుంబానికి – ఒక కనెక్షన్” విధానాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పీఎన్జీ కనెక్షన్లు పెరుగుతున్నప్పటికీ ఎల్పీజీ వినియోగం తగ్గకపోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక కుటుంబాలు రెండు కనెక్షన్లు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఇకపై నిర్దేశిత గడువులోగా ఎల్పీజీ కనెక్షన్ నిలిపివేయకపోతే గ్యాస్ సరఫరా నిలిపివేత లేదా కనెక్షన్ రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!