
న్యూస్

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగేలా ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్-4 పేరుతో ఇజ్రాయెల్‌పై సర్ప్రైజ్ దాడులు చేపట్టినట్లు ప్రకటించింది. ఇరాన్ వర్గాల ప్రకారం కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్టు పేర్కొనగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం సమీపం కూడా లక్ష్యంగా మారిందని సమాచారం వెలువడింది. అయితే ఈ సమాచారం పై స్వతంత్ర ధృవీకరణ ఇంకా లభించలేదు.
ఇజ్రాయెల్ ప్రధాని పరిస్థితి గురించి స్పష్టత లేదని ఇరాన్ అధికారులు పేర్కొనగా, ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఎలాంటి నష్టం జరిగినట్టు ప్రకటించలేదు. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీస్తుండగా, అంతర్జాతీయ సమాజం ప్రాంతీయ భద్రతా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!