
రాజకీయాలు

వక్ఫ్ ట్రైబ్యునల్స్ను ఆశ్రయించే వక్ఫ్ సంస్థలకు కోర్టు రుసుముల నుంచి మినహాయింపు ఎందుకు ఇవ్వాలన్నదానిపై సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏ చట్టం ప్రకారం ఈ మినహాయింపు కోరుతున్నారని జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం నిలదీసింది. కోర్టు రుసుములు చెల్లించని కారణంగా వ్యాజ్యాలను తిరస్కరించిన గుజరాత్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
మరో కేసులో నీట్ యూజీ రీటెస్ట్ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పరీక్షను ప్రస్తుత పేపర్–పెన్ను విధానంలోనే నిర్వహించాలని తెలిపింది. పరీక్ష విధానాన్ని అకస్మాత్తుగా మార్చడం ఆచరణాత్మకంగా కష్టమని, ఎన్టీఏ ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కొంటోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!