

త్రిష, విజయ్ గురించి వస్తున్న రూమర్లు ఇటీవల సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలపై స్పందించని త్రిష, తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్ట్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. తన పెంపుడు కుక్క ఫొటోను షేర్ చేస్తూ, “నా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడానికి దీన్ని మాత్రమే అనుమతిస్తాను” అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలను పలువురు అభిమానులు పరోక్ష స్పందనగా భావిస్తున్నారు.
ఇక ఇటీవల మే నెల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ త్రిష కొన్ని ఫొటోలను పంచుకున్నారు. “మ్యాజికల్ మే” అంటూ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె పుట్టినరోజు వేడుకలు, ఇటీవల విడుదలైన కరుప్పు చిత్రం విజయవంతమైన ప్రదర్శన వంటి అంశాలు ఈ నెలను ఆమెకు ప్రత్యేకంగా మార్చినట్లు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత జీవితంపై రూమర్లు కొనసాగుతున్నప్పటికీ, త్రిష తన సినీ ప్రయాణంలో వరుస విజయాలతో ముందుకు సాగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!