
సినిమాలు

తమిళ సినీ పరిశ్రమ నుంచి మరొక ప్రముఖ నటుడు రాజకీయాల్లోకి రావచ్చన్న వార్తలు కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్న తర్వాత, మరో స్టార్ కూడా రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ అంశంపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.
ఈ చర్చకు కారణం ధనుష్ తండ్రి కస్తూరి రాజా చేసిన వ్యాఖ్యలు. ఆయన మాట్లాడుతూ ధనుష్ లేదా సెల్వరాఘవన్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావచ్చు అని పేర్కొన్నారు. అయితే తాను మాత్రం వయసు కారణంగా రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో ధనుష్ రాజకీయ ప్రవేశంపై రూమర్స్ మరింత వేడెక్కాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!