
సినిమాలు

చెన్నై పోర్టులో ఈరోజు ఉదయం ఊహించని ఘటన చోటుచేసుకుంది. పోర్టు యార్డులో నిల్వ ఉంచిన సల్ఫర్ రసాయనం అధిక ఉష్ణోగ్రతల కారణంగా చర్యకు గురై దట్టమైన పొగలు వెలువడ్డాయి. ఎరువుల తయారీ కోసం దిగుమతి చేసిన ఈ సల్ఫర్ నుంచి ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా పొగలు రావడం ప్రారంభమైంది.
ఈ దట్టమైన పొగలు పోర్టు పరిసరాల్లో సుమారు 4 నుంచి 5 కిలోమీటర్ల వరకు వ్యాపించడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు శ్వాస సమస్యలతో అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన అధికారులు సమీప రహదారులను తాత్కాలికంగా మూసివేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!