
సినిమాలు

ఈ నెల 12 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విభాగం ప్రారంభం కానున్నదని మండల విద్యాధికారి రామయ్య తెలిపారు. మండలంలోని కాసింపేట, మైలారం యూపీఎస్, గన్నేరువరం పీఎస్ పాఠశాలలకు ప్రీ ప్రైమరీ విభాగాలు మంజూరైనట్లు ఆయన వెల్లడించారు.
ప్రతి పాఠశాలలో 25 మంది విద్యార్థుల ప్రవేశాలు జరిగేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని సూచించారు. ప్రతి పాఠశాలలో ఒక ఇన్‌స్ట్రక్టర్, ఒక ఆయా పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్‌తో పాటు డీఈడీ అర్హత కలిగిన స్థానిక మహిళలు ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు, పదవ తరగతి ఉత్తీర్ణులైన మహిళలు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!