
రాజకీయాలు

వ్యక్తుల గోప్యత హక్కు విస్తృత రూపమే “విస్మరణ హక్కు” అని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. నిర్దోషులుగా తేలిన వారు, నేరారోపణల నుంచి విముక్తి పొందిన వారు, వివాదాలను పరిష్కరించుకున్న వారి పేర్లను కోర్టు తీర్పులు, వార్తల నుంచి సెర్చ్ ఇంజిన్లు తొలగించాలని ఆదేశించింది.
జస్టిస్ సచిన్ దత్తా ధర్మాసనం మాట్లాడుతూ, గత నేరారోపణలను పదేపదే గుర్తు చేయడం వారి గౌరవానికి భంగం కలిగిస్తుందని పేర్కొంది. న్యాయవ్యవస్థ పారదర్శకత ముఖ్యమైనదే అయినా, ఆన్లైన్లో పాత కేసుల సమాచారాన్ని కొనసాగించడం వ్యక్తిగత గోప్యతను దెబ్బతీస్తుందని తెలిపింది. గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లు తమ డేటాబేస్ల నుంచి ఆ సమాచారాన్ని తొలగించాలని కోర్టు ఆదేశించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!