

వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో తన అద్భుత ప్రదర్శనతో భారత క్రికెట్‌లో కొత్త సంచలనంగా నిలిచాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ యువ ఆటగాడు, ఇప్పుడు బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ప్రపంచంలోనూ హాట్ ప్రాపర్టీగా మారాడు. మైదానంలో సాధించిన విజయాలు అతని మార్కెట్ విలువను కూడా భారీగా పెంచినట్లు తెలుస్తోంది.
రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు సాధించి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 237.30 స్ట్రైక్‌రేట్‌తో బౌలర్లపై విరుచుకుపడిన అతడు ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. గతంలో ఒక్కో బ్రాండ్ ఒప్పందానికి దాదాపు రూ.1 కోటి అందుకున్న వైభవ్, ప్రస్తుతం ఒక్కో డీల్‌కు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంప్లాన్, రెడ్ బుల్ వంటి ప్రముఖ బ్రాండ్లతో పనిచేసిన అతనిపై మరిన్ని సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అయితే ఈ విజయాలను సమర్థంగా ఉపయోగించుకుంటూ తన క్రికెట్ ప్రయాణాన్ని మరింత బలంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!