
రాజకీయాలు

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ ఇషాక్ ప్యాటర్సన్ హైదరాబాద్ మెట్రో సేవలను ప్రశంసించారు. న్యూయార్క్ మెట్రో కంటే హైదరాబాద్ మెట్రో మరింత బాగుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో గత నాలుగు రోజులుగా వైరల్ అవుతోంది. భారత్ పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆయన మెట్రోలో ప్రయాణించి తన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోగా పంచుకున్నారు.
ఆ వీడియోలో స్టేషన్‌లో ప్రయాణికులు ఎదురుచూస్తున్న దృశ్యాలను చూపిస్తూ, ఇది చాలా అద్భుతమైన అనుభవమని తెలిపారు. ఇప్పటివరకు తాను ప్రయాణించిన మెట్రో వ్యవస్థల్లో హైదరాబాద్ మెట్రో తనకు అత్యంత ఇష్టమైన వాటిలో ఒకటని చెప్పారు. మెట్రో కోచ్‌ల పరిశుభ్రత, నిర్వహణ, ఆకర్షణీయమైన ప్రకటనలు తనను ఎక్కువగా ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!