
సినిమాలు

తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు గుణశేఖర్ తన కెరీర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన–మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన ‘ఒక్కడు’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచి మహేష్‌కు మాస్ ఆడియన్స్‌లో భారీ క్రేజ్ తెచ్చింది. భూమిక హీరోయిన్గా నటించగా, ప్రకాష్ రాజ్ ప్రతినాయకుడిగా మెప్పించారు.
తాజాగా గుణశేఖర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఒక్కడు’ కథను మహేష్ బాబు కోసం ప్రత్యేకంగా రాసి ఉంటే అది ‘సైనికుడు’లా మారేదని ఆయన అన్నారు. మహేష్‌తో చేసిన తర్వాతి సినిమాలు ‘అర్జున్’, ‘సైనికుడు’ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!