

భద్రతా కారణాల నేపథ్యంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని భారత వీసా కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఇటీవల బంగ్లాదేశ్‌లో కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, అసాంఘిక శక్తుల నుంచి బెదిరింపులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఢాకాలోని జమునా ఫ్యూచర్ పార్క్‌లో ఉన్న ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ (IVAC) ను బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మూసివేస్తున్నట్లు IVAC అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో బుధవారానికి షెడ్యూల్ అయిన వీసా దరఖాస్తులను తదుపరి తేదీకి మార్చనున్నట్లు తెలిపింది.
ఇదే సమయంలో భారత విదేశాంగ శాఖ బంగ్లాదేశ్ హై కమిషనర్ మహమ్మద్ రియాజ్ హమీదుల్లాకు సమన్లు జారీ చేసింది. ఢాకాలోని భారత హైకమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తతలు సృష్టించేందుకు కొన్ని తీవ్రవాద శక్తులు కుట్ర చేస్తున్నాయని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో భారత దౌత్య సిబ్బంది, కార్యాలయాల భద్రతను నిర్ధారించడం బంగ్లాదేశ్‌లోని మధ్యంతర ప్రభుత్వ బాధ్యత అని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!