పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు భారత్–పాక్ సంబంధాలపై మరోసారి దృష్టిని ఆకర్షించాయి. ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో భారత్ దాడులు జరుపుతున్న వేళ తనను బంకర్లోకి వెళ్లమని సలహా ఇచ్చారని, అయితే తాను అందుకు ఒప్పుకోలేదని ఆయన వెల్లడించారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని జర్దారీ ఆరోపించారు. పాకిస్థాన్ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించిన ఆయన, ఇండస్ వాటర్స్ ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా భారత్ ‘హైడ్రో టెరరిజం’కు పాల్పడిందని విమర్శించారు. నీటిని రాజకీయ ఆయుధంగా ఉపయోగించడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు.
అయితే పాకిస్థాన్ శాంతి, సంభాషణ ద్వారానే సమస్యలను పరిష్కరించాలనుకుంటోందని, ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్తో చర్చలకు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో ఇండస్ వాటర్స్ ఒప్పందం నిలిపివేత, సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, పరస్పర ఆరోపణలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత క్లిష్టతరం చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు దేశాలు శాంతి దిశగా అడుగులు వేస్తాయా? లేక ఉద్రిక్తతలు మరింత ముదురుతాయా? అన్నది వేచి చూడాల్సిన అంశంగా మారింది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!