

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్ తదితర దేశాలపై జరిగిన దాడుల నేపథ్యంలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న సుమారు 90 లక్షల మంది భారతీయుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు దేశాల నాయకులతో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారు.
బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, జోర్డాన్ రాజు అబ్దుల్లా-2లతో మోదీ మాట్లాడి దాడులను ఖండించారు. ఇరుదేశాల ప్రజలకు సంఘీభావం తెలుపుతూ భారతీయుల క్షేమంపై ఆరా తీశారు. అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతోనూ చర్చలు జరిపినట్లు వెల్లడించారు. అన్ని వివాదాలకు దౌత్య చర్చలే పరిష్కారమని, శత్రుత్వానికి త్వరగా ముగింపు పలకాలని భారత్ పునరుద్ఘాటించింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!