

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ చమురు మార్కెట్‌ను కుదిపేసింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ముడి చమురు ధరలు ఒక్కరోజులోనే భారీగా పెరిగాయి. బ్యారెల్ ధర ఒక దశలో 119 డాలర్లకు చేరడంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిపై దాడులు జరగడంతో రోజుకు సుమారు 15 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా నిలిచిపోయింది. దీంతో అనేక దేశాలు చమురు సరఫరాపై పరిమితులు విధించగా, కొన్ని దేశాలు ఇంధన ధరలను పెంచుతున్నాయి.
ఇరాన్ సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ ఎన్నిక కావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. చమురు క్షేత్రాలు, రవాణా మార్గాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేయడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. మరోవైపు ఇరాన్ లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటంతో యుద్ధం మరింత విస్తరిస్తుందనే భయం వ్యక్తమవుతోంది. చమురు ధరల పెరుగుదలతో భారత్ సహా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!