
న్యూస్

టాలీవుడ్ ప్రముఖ గాయని గీతా మాధురి సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే తాజాగా గాయకుడు నోయెల్ సీన్ నిర్వహిస్తున్న యూట్యూబ్ టాక్ షోలో పాల్గొని సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తాను చాలా అరుదుగా కాఫీ షాపులకు వెళతానని, కానీ వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక సెలబ్రిటీ జంట అక్కడ ‘రెడ్ హ్యాండెడ్’గా కనిపిస్తుందని వెల్లడించారు.
“నేను చూసిన విషయాలు బయటపెడితే చాలా మంది కాపురాలు కూలిపోవడం ఖాయం” అని నవ్వుతూ చెప్పిన ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆ ‘సీక్రెట్ కపుల్స్’ ఎవరనే దానిపై నెటిజన్లు ఆసక్తిగా చర్చిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో కొత్త చర్చలకు దారితీశాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!