
న్యూస్

సూపర్ స్టార్ రజినీకాంత్ 'తలైవర్ 173' సినిమా ప్రారంభం నుంచే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా దర్శకుడు ఎవరు అన్న అంశంపై గత కొంతకాలంగా అనేక ఊహాగానాలు వినిపించాయి. పలువురు దర్శకుల పేర్లు ప్రచారంలోకి రావడంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది.
తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేసే అవకాశం మళ్ళీ సిబి చక్రవర్తికి దక్కినట్లు తెలుస్తోంది. 'డాన్' సినిమాతో తన ప్రతిభను నిరూపించుకున్న ఈ యువ దర్శకుడు, రజనీకాంత్‌కు మళ్ళీ కథ వినిపించి గ్రీన్ సిగ్నల్ పొందినట్లు టాక్ వినిపిస్తోంది. కథ నరేషన్ రజనీకాంత్‌ను ఆకట్టుకోవడం ఈ నిర్ణయానికి కారణమైందని సమాచారం.ఈ సినిమా పై అంచనాలు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి.


.jpg&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!