

రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎల్బీనగర్ నుండి హయత్‌నగర్ వరకు ప్రతిపాదించిన 7.1 కి.మీ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ పురోగతిపై డా.బి.ఆర్ అంబేడ్కర్ తెలంగాణ సెక్రటేరియట్‌లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సుమారు 4 గంటల పాటు కొనసాగింది. రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సుమారు రూ.941 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రూ.200 కోట్ల రాష్ట్ర వాటా ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ కారిడార్ పూర్తయితే NH-65 పై ట్రాఫిక్ రద్దీ తగ్గి సుమారు 20 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు తెలిపారు. రోజువారీగా జరుగుతున్న ప్రమాదాలు తగ్గి, 54 కాలనీల ప్రజలకు సురక్షిత రవాణా అందుతుందని చెప్పారు. టెండర్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కేంద్ర అధికారులను మంత్రి కోరారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!