

ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా–ఇజ్రాయెల్ మొదటి రోజు దాడుల్లో ఆయన కాలికి గాయం కావడంతో పాటు ముఖం కూడా తీవ్రంగా కాలిపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ గాయాల కారణంగా ఆయనకు ఇప్పటికే అనేక శస్త్రచికిత్సలు జరిగినట్లు, కాలు గాయానికి మూడు సార్లు ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చిందని తెలుస్తోంది. అలాగే కృత్రిమ కాలు అమర్చే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం. చేతికి జరిగిన శస్త్రచికిత్స అనంతరం పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ, ముఖం మరియు పెదవులు తీవ్రంగా కాలిపోవడంతో ఆయనకు మాట్లాడటంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కథనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ సర్జరీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం మొజ్తాబా ఖమేనీని భద్రతా కారణాల దృష్ట్యా రహస్య ప్రాంతంలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఆయనకు సమాచారం చేరవేయడానికి చేతితో రాసిన ఉత్తరాలను మాత్రమే ఉపయోగిస్తున్నారని, అవి మోటార్‌సైకిళ్ల ద్వారా రహస్య ప్రదేశానికి చేరవేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్ నిఘా నుంచి రక్షణ కోసం ఉన్నతాధికారులు కూడా ఆయనను ప్రత్యక్షంగా కలవడం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో దేశ పాలన కోసం మొజ్తాబా ఖమేనీ ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ బోర్డుకు ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ జనరల్స్ సభ్యులుగా ఉన్నారని, వారి సలహాలు మరియు మార్గదర్శకాల ఆధారంగా యుద్ధం, దౌత్యం, జాతీయ భద్రత వంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని రాజకీయ వర్గాలు వెల్లడించాయి.




.webp&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!