

న్యాచురల్ స్టార్ నాని సాధారణంగా వేగంగా సినిమాలు పూర్తి చేస్తూ, వరుసగా విడుదలలు ఇస్తాడు. కానీ ప్రస్తుతం 'ది ప్యారడైజ్' సినిమా కారణంగా ఆయన కెరీర్‌లో కొంత ఆలస్యం ఏర్పడింది. ఈ సినిమా షూటింగ్ వాయిదాలు పడటంతో ఆయన ఇతర ప్రాజెక్టులు కూడా ప్రభావితమయ్యాయి.
తాజా సమాచారం ప్రకారం నాని చేయాల్సిన కొన్ని కీలక ప్రాజెక్టులు ఇప్పుడు ఇతర హీరోల వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. శౌర్యువ్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా విజయ్ దేవరకొండ వద్దకు వెళ్లగా, సిబి చక్రవర్తి ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. అలాగే టీజే జ్ఞానవేల్ సిద్ధం చేసిన కథను ఇప్పుడు సూర్యతో తెరకెక్కించనున్నట్లు సమాచారం.
ఇక సుజిత్ దర్శకత్వంలో ప్రకటించిన బ్లడీ రోమియో సినిమా కూడా ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉంది. నాని ది ప్యారడైజ్ పూర్తి చేసిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఒక సినిమా ఆలస్యం కారణంగా పలు అవకాశాలు కోల్పోవడం నాని కెరీర్‌కు సవాలుగా మారింది. ఆయన మునుపటిలా త్వరగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని అభిమానులు ఆశిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!