
సినిమాలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి వస్తోందని అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించారు. శక్తివంతమైన పోస్టర్‌ను షేర్ చేస్తూ ఈ చిత్రం 2027 జూన్ 11న వరల్డ్‌వైడ్ థియేటర్లలో విడుదల కానుందని వెల్లడించారు. రగ్గడ్ లుక్‌లో ఉన్న సిల్హౌట్‌తో పాటు “కాంకరింగ్ వరల్డ్‌వైడ్” అనే ట్యాగ్‌లైన్ ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని సూచిస్తోంది.

“హిస్ రేన్… హిస్ సాయిల్… జూన్ 11, 2027… ఇట్ ఈజ్…” అంటూ చేసిన క్యాప్షన్ అభిమానుల్లో ఉత్కంఠను మరింత పెంచింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను మే 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ ప్రకటన సోషల్ మీడియాలో ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది, అభిమానులు ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!