.png&w=3840&q=75)

జెహ్ ఏరోస్పేస్, అమెరికాకు చెందిన విమానయాన ఉత్పత్తుల తయారీ సంస్థ, లైబర్ ఏరోస్పేస్తో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం నారో-బాడీ వాణిజ్య విమానాలకు అవసరమైన ల్యాండింగ్ గేర్ విడిభాగాలను హైదరాబాద్లోని తమ ప్లాంట్లో తయారు చేసి సరఫరా చేయనుంది. లైబర్ ఏరోస్పేస్ & ట్రాన్స్పోర్టేషన్ ఎస్ఏఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ వాండెల్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ఈ ఒప్పందం ఖరారైంది.
ఇప్పటివరకు 2 లక్షలకు పైగా కీలక విడిభాగాలను నాణ్యత లోపాలు లేకుండా విజయవంతంగా సరఫరా చేసినట్లు సంస్థ వెల్లడించింది. సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ విశాల్ ఆర్ సంగ్హవి మాట్లాడుతూ ల్యాండింగ్ గేర్ విమాన భద్రతలో అత్యంత కీలకమైన వ్యవస్థలలో ఒకటని తెలిపారు. ఈ ముఖ్యమైన ఉత్పాదక బాధ్యతలను దక్కించుకోవడం సంస్థకు గొప్ప మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు.










.png&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!