
సినిమాలు

ప్రతిష్టాత్మక లండన్ మారథాన్లో కెన్యాకు చెందిన సెబాస్టియన్ స్వే చరిత్ర సృష్టించాడు. ఆయన 1 గంట 59 నిమిషాలు 30 సెకన్లలో మారథాన్ పూర్తి చేసి, రెండు గంటల్లోపే ఈ రేసును పూర్తి చేసిన తొలి అథ్లెట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 2023లో ఎలియుడ్ కిప్‌చోగే నమోదు చేసిన 2:00:34 రికార్డును 65 సెకన్ల తేడాతో బద్దలుకొట్టాడు. రెండో స్థానంలో నిలిచిన యోమిఫ్ కెజల్చా కూడా రెండు గంటల్లోపే రేసును ముగించడం విశేషం.
మహిళల విభాగంలో ఇథియోపియాకు చెందిన టిగిస్ట్ అస్సేఫా తన రికార్డును తానే తిరగరాసుకుంటూ 2 గంటలు 15 నిమిషాలు 41 సెకన్లలో రేసును పూర్తి చేసింది. ఈ పోటీ అథ్లెటిక్స్ ప్రపంచంలో కొత్త చరిత్రను సృష్టించడమే కాకుండా, భవిష్యత్‌కు మరింత ఉన్నత ప్రమాణాలను సెట్ చేసింది.


.webp&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!