
టెక్నాలజీ

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తన కుమారుడు జునైద్ ఖాన్ నటించిన ‘ఏక్ దిన్’ చిత్రాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. జునైద్‌తో పాటు సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మే 1న విడుదలకు సిద్ధమవుతోంది. విడుదలకు ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈవెంట్లో ఈ చిత్రాన్ని వీక్షించిన ఆమిర్ తీవ్రంగా భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ సందర్భంగా ఆయన కన్నీళ్లు పెట్టుకోవడంతో, పక్కనే ఉన్న సాయి పల్లవి ఆయనను ఓదార్చారు. ఈ భావోద్వేగ క్షణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఏక్ దిన్’ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉండగా, ఈ ఘటనతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!