
రాజకీయాలు

మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ విడుదలైన వెంటనే బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 24 న విడుదలైన ఈ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించినట్లు సమాచారం. బయోపిక్ చిత్రాల్లో ఇదే అత్యధిక ఓపెనింగ్ అని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాలో మైఖేల్ జాక్సన్ పాత్రను ఆయన అన్న కొడుకు జాఫర్ జాక్సన్ పోషించాడు. మైఖేల్ జాక్సన్ స్టైల్, డాన్స్, హావభావాలను అచ్చంగా చూపించాడని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజే తన ఖర్చును తిరిగి రాబట్టినట్లు సమాచారం.







.png&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!