.jpg&w=3840&q=75)

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురై నీరసం, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన అలవాట్లు పాటించడం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. దాహం వేసినా వేయకపోయినా తరచూ నీరు తాగడం మంచిది. అలాగే కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి సహజ పానీయాలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. వేసవిలో జీర్ణక్రియ కొంత మందగించవచ్చు కాబట్టి నూనెలో వేయించిన పదార్థాలు, మసాలా ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించడం మంచిది. పుచ్చకాయ, దోసకాయ, నారింజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు తింటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
చాలా మంది అలసటగా అనిపిస్తే పదేపదే కాఫీ, టీ లేదా కూల్‌డ్రింక్స్ తీసుకుంటారు. అయితే ఇవి తాత్కాలికంగా శక్తిని ఇచ్చినట్లు అనిపించినా, తరువాత శరీరాన్ని మరింత డీహైడ్రేట్ చేసే అవకాశం ఉంది. అందుకే వీటి బదులుగా ఇంట్లో తయారుచేసిన పండ్ల రసాలు తీసుకోవడం మంచిది. అలాగే శరీరం తిరిగి శక్తిని పొందాలంటే తగినంత నిద్ర కూడా చాలా అవసరం. వేసవిలో రాత్రిపూట సరిగా నిద్ర పట్టకపోతే మరుసటి రోజు రోజంతా నీరసంగా అనిపించవచ్చు. కాబట్టి చల్లని, ప్రశాంతమైన వాతావరణంలో కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే వేసవి వేడిని తట్టుకోవడంతో పాటు రోజువారీ పనులను మరింత ఉత్సాహంగా పూర్తి చేయవచ్చు.
గమనిక : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.










.jpg&w=3840&q=75)


4225-1768468351.png&w=3840&q=75)


_0.jpg.webp&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!