
టెక్నాలజీ

మేడ్చల్ జిల్లా చీర్యాల బాలాజీ ఎన్‌క్లేవ్‌లో హిజ్రాలు రెచ్చిపోయిన ఘటన చోటుచేసుకుంది. అక్కడ నివసిస్తున్న సదానందం అనే వ్యక్తి తన ఇంటిలో గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించగా, హిజ్రాలు వచ్చి రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. సదానందం అంత పెద్ద మొత్తం ఇవ్వలేనని చెప్పడంతో వారు కోపంతో తిడుతూ వెళ్లిపోయారు. కొద్దిసేపటికి మరో 15 మంది హిజ్రాలను తీసుకొని తిరిగి వచ్చి, సదానందం కుటుంబ సభ్యులపై కర్రలతో దాడి చేశారు. దాడిలో సదానందం తలకు గాయాలు అయ్యాయి. అనంతరం హిజ్రాలు అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అధికారులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.










కామెంట్స్ (1)
బాధితులకు న్యాయం చేయాలి