
క్రీడలు

సినిమా రంగంలో కాపీరైట్ వివాదాలు కొత్తవి కావు. కానీ 1989 లో నందమూరి బాలకృష్ణ నటించిన అశోక చక్రవర్తి, వెంకటేష్ నటించిన ధ్రువ నక్షత్రం సినిమాల మధ్య జరిగిన వివాదం టాలీవుడ్ చరిత్రలో గుర్తుండిపోయింది. ఈ రెండు సినిమాలు మలయాళ చిత్రం ఆర్యన్ కథ ఆధారంగా రూపొంది, 1989 జూన్ 29 న ఒకే రోజు విడుదలయ్యాయి. ఇందులో వెంకటేష్ సినిమా సూపర్ హిట్ అవ్వగా, బాలకృష్ణ సినిమా ఫ్లాప్ అయింది.

అశోక చక్రవర్తి నిర్మాతలు హక్కులు కొనుగోలు చేసినప్పటికీ, అదే కథతో మరో సినిమా రావడంపై తీవ్రంగా స్పందించారు. ధ్రువ నక్షత్రం టీమ్‌తో పాటు పరుచూరి బ్రదర్స్‌పై కూడా విమర్శలు చేశారు. వెంకటేష్ తనకు ముందే విషయం తెలిసి ఉంటే సినిమా చేసేవాడిని కాదని స్పష్టం చేయగా, బాలకృష్ణ మాత్రం ఈ వివాదంపై స్పందించకుండా మౌనం పాటించారు. ఈ ఘటన ఇప్పటికీ టాలీవుడ్లో పెద్ద వివాదంగా గుర్తించబడుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!