

ధురంధర్ 2 సినిమా మార్చి 19 న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందింది. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ నమోదు చేసుకుని ప్రేక్షకుల్లో ఆసక్తిని కొనసాగించింది. ఈ చిత్రాన్ని వచ్చే నెల 20 న ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు ముందుగా నిర్ణయించారు. అయితే సినిమా పాజిటివ్ టాక్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఆసక్తి ఇంకా తగ్గలేదు.
ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కూడా ఈ నిర్ణయంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. సాధారణంగా వచ్చే నెల మధ్యలో ఈ టోర్నమెంట్ ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంటుంది. దీంతో క్రికెట్‌కు సంబంధించిన వార్తలు మరియు ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా అక్కడే ఉంటుంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు ఓటీటీ విడుదలను జూన్ నెలకు వాయిదా వేసినట్లు సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!