

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గృహ పథకంలో భాగంగా 2016కు ముందు ఇంటిపట్టాలు పొందిన వారికి వాటిని అమ్ముకోవడం, రిజిస్ట్రేషన్ చేయడం, గిఫ్ట్‌గా ఇవ్వడం వంటి హక్కులు కల్పించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో సుమారు 75 లక్షల పేద కుటుంబాలకు లాభం కలగనుంది. అలాగే 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఈనాం భూములను 22ఏ జాబితా నుంచి తొలగించేందుకు కూడా అనుమతి ఇచ్చారు.
ఇంకా, మరో లక్ష ఎకరాల ఈనాం భూములకు విముక్తి ఇవ్వడంతో పాటు, ఫ్రీహోల్డ్ కింద రిజిస్ట్రేషన్ ఆగిపోయిన 9.25 లక్షల ఎకరాలకు త్వరలో యాజమాన్య హక్కులు ఇవ్వనున్నారు. భూ రికార్డులను పూర్తిగా డిజిటల్ చేసి, ఈకేవైసీ తర్వాత బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో భద్రపరుస్తారు. ఆధార్ ద్వారా భూమి వివరాలను లాక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి రీసర్వే పూర్తి చేసి 80 లక్షల పట్టాదారు పాస్‌బుక్స్ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!