

దర్శకుడు అనిల్ రావిపూడి వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం తన పదో సినిమాను వెంకటేష్ మరియు కళ్యాణ్ రామ్ తో రూపొందిస్తున్నాడు. ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా కూడా విజయాన్ని సాధిస్తుందా అనే ఉత్కంఠ అందరిలో ఉంది.
ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర గురించి ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ పాత్ర కోసం కమల్ హాసన్ ని తీసుకురావాలని దర్శకుడు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ పాత్ర చాలా భిన్నంగా ఉండబోతుందని, అందులో మంచి నటనకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఇంకా కథను కమల్ హాసన్‌కు వినిపించలేదు. త్వరలోనే కథ చెప్పి ఆయన నుంచి కొన్ని రోజులు తేదీలు తీసుకుని చిత్రీకరణ పూర్తి చేయాలని యోచిస్తున్నారు. కమల్ హాసన్ ఒప్పుకుంటే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయి. అలాగే ఈ సినిమా సాధారణ వాణిజ్య చిత్రాల కంటే కొంచెం కొత్తగా ఉండబోతుందని కూడా సమాచారం.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!