

వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్న తప్పుడు ప్రచారాల పై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం విచారించింది. ఈ పిటిషన్ల పై జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాలు తమ వ్యక్తిగత గౌరవం, హక్కులను దెబ్బతీస్తున్నాయని ప్రముఖ నటులు జూ.ఎన్టీఆర్ మరియు పవన్ కళ్యాణ్ పిటిషన్లలో పేర్కొన్నారు.
ఇరు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ కోర్టులో వాదనలు వినిపించారు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన ఫోటోలు, అవమానకరమైన వ్యాఖ్యలతో కూడిన పోస్టులు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయని ఆయన ధర్మాసనానికి వివరించారు.
ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల వ్యక్తిగత ప్రతిష్ఠకు తీవ్ర నష్టం కలుగుతోందని, వాటిని అడ్డుకునేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ వ్యవహారం పై కోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!