
గాసిప్స్

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం భూముల రీసర్వే ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై భూయజమాని సమక్షంలోనే సర్వే నిర్వహించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. భూయజమాని అందుబాటులో లేకపోతే సర్వేను వాయిదా వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
అలాగే భూ రికార్డులను యజమాని స్వయంగా ధ్రువీకరించిన తర్వాతే పాస్ పుస్తకాలు ముద్రించాలని నిర్ణయించింది. ప్రతి నెల 2వ తేదీ నుంచి 9వ తేదీ మధ్య పాస్ పుస్తకాల పంపిణీ పూర్తిచేయాలని రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించింది. ఈ మార్పులతో భూసంబంధిత వివాదాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!