

రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2047లో ఆమె పాల్గొని, రాష్ట్ర దీర్ఘకాల ప్రగతి లక్ష్యాలపై జరిగిన చర్చల్లో భాగమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, క్రీడాకారులకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని అభినందించారు.
భవిష్యత్ నగరం అభివృద్ధిలో ఈ సమ్మిట్ కీలక పాత్ర పోషించబోతోందని సింధు పేర్కొన్నారు. ముఖ్యంగా, ఆధునిక క్రీడా మైదానాలు, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు కావడానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని ఆమె తెలిపారు. ఇలాంటి సమ్మిట్లు యువ క్రీడాకారులకు కొత్త అవకాశాలు తెరవడమే కాకుండా, ప్రతిభను పెంపొందించడానికి అవసరమైన వాతావరణం, వనరులు సమకూరుస్తాయని సింధు అభిప్రాయపడ్డారు. దీంతో రాష్ట్ర క్రీడారంగం మరింత బలోపేతం అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!