
సినిమాలు

పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా ఇరాన్‌పై భారీ ఎయిర్ దాడులు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనికి ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు చేపట్టి, మరిన్ని చర్యలకు హెచ్చరికలు జారీ చేసింది. విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలు ఉద్రిక్తతను మరింత పెంచాయి.
అవసరమైతే హర్మూజ్ సముద్ర మార్గాన్ని పూర్తిగా మూసేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అలాగే ఇజ్రాయెల్ విద్యుత్ కేంద్రాలు, అమెరికాతో సంబంధం ఉన్న సంస్థలను లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టం చేసింది. ఇరాన్ విప్లవ గార్డు విడుదల చేసిన వీడియో ద్వారా ట్రంప్‌పై వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. ఈ పరిణామాలు ప్రపంచ స్థాయిలో భద్రత, ఇంధన సరఫరాపై ఆందోళనలు పెంచుతున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!