
.webp&w=3840&q=75)
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా బీజేపీ చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సహా పలువురు నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రభుత్వ అసహనానికి నిదర్శనమని అన్నారు. ప్రజల సమస్యలపై స్పందించే ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
తెలంగాణలో ప్రజాస్వామ్యం నడుస్తోందా లేదా పోలీస్ రాజ్యమే కొనసాగుతోందా అని ఆయన ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తున్న నాయకులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. అవినీతి, అసమర్థ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం ఆగదని, ప్రజా ప్రయోజనాల కోసం ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.











.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!